Uses of vitamins

Uses of vitamins

విటమిన్ ఉపయోగాలు [good quality of vitamins]

సమతుల్యమైన ఆరోగ్యం కోసం నాణ్యత గల పోషక పదార్థాలను విటమిన్స్ అంటారు. ఈ పోషక పదార్థాలు మన శరీరంలోని ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేలా పనిచేస్తాయి. ఈ విటమిన్స్ గురించి తెలుసుకోవడం వలన మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు.

విటమిన్స్ రకాలు

  • A- విటమిన్
  • B-2విటమిన్ (B1,B2,B3,B5,B6,B9, B12)
  • C-విటమిన్
  • D-విటమిన్
  • E-విటమిన్
  • K-విటమిన్

విటమిన్స్ ఉపయోగాలు

  • A- విటమిన్; శరీర ఆరోగ్య పరిరక్షణకు A- విటమిన్ ఎంతో సహాయపడుతుంది. వైరస్ బ్యాక్టీరియాలను చంపే శక్తి A- విటమిన్ కు ఉంటుంది.
  • కంటి చూపు సమస్యలకు A-విటమిన్ ఉపయోగపడుతుంది.
  • తెల్ల రక్త కణాల ఉత్పత్తికి A- విటమిన్ సహాయపడుతుంది.
  • A-విటమిన్ లభించే పదార్థాలు; క్యారెట్స్, చిలగడదుంప, తోటకూర, గోంగూర, మెంతికూర, ఆకుకూరల్లో మాంసాహారం లోను a- విటమిన్ అధికంగా ఉంటుంది.
  • B-విటమిన్; శరీర బలానికి B- విటమిన్ ఎంతో మేలు చేస్తుంది. ఈ విటమిన్ గర్భిణీ స్త్రీలకు బాగా ఉపయోగపడుతుంది. నరాల బలహీనత ఉన్నవారికి B-విటమిన్ ఎంతగానో సహాయపడుతుంది. B- విటమిన్ లభించే పదార్థాలు: అరటి పండ్లు, పాలకూర, గోరుచిక్కుళ్లు, పుదీనా, పెసలు, సెనగలు.
  • B2-విటమిన్; B2-విటమిన్ లోపం వల్ల నోటి సంబంధిత వ్యాధులు సంభవిస్తాయి. B2- విటమిన్ ని ‘రెబోఫ్లోవిన్’ అని కూడా అంటారు. నిద్ర సమస్యలు, తలనొప్పి, అలసట, చర్మం
  • పొడిబారటం వంటి సమస్యలు ఎదురవుతాయి. B2- విటమిన్ లభించే పదార్థాలు: పాలు, గుడ్లు, ఆకుకూరలు, మాంసాహారం, సీతాఫలం, పెరుగు,ద్రాక్ష,
  • అవకాడ, బోకలీ,బొప్పాయి వంటి పదారాలలో B2-విటమిన్ లభిస్తుంది.
  • B3- విటమిన్; నాడీ వ్యవస్థకు B3- విటమిన్ ఎంతో అవసరం. దీనిని ‘నికోటిన్’ ఆమ్లం అని కూడా అంటారు, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మతిమరుపు నివారిస్తుంది. బరువును తగ్గిస్తుంది.
  • B3- విటమిన్ లభించే పదార్థాలు: వేరుశెనగలు, చిలగడదుంప, పాలు, గుడ్లు, ఆకుకూరలు మొదలగు వాటిలో b3- విటమిన్ అధికంగా ఉంటుంది.
  • B5- విటమిన్: రక్త నాళాలు మెరుగ్గా పనిచేయడానికి B5- విటమిన్ సహాయపడుతుంది. గుండె యొక్క సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది, జ్ఞాపకశక్తిని చురుగ్గా ఉండేలా చేస్తుంది, కంటి నొప్పి సమస్యలు తొలగిపోతాయి.
  • B5- విటమిన్ లభించే పదార్థాలు: కార్బోహైడ్రేట్స్, చికెన్, పాలకూర, ఓట్స్, గుడ్లు, వేరుశనగలు, గింజలు,
  • B6- విటమిన్: రక్తహీనత నిరోధక విటమిన్ అని కూడా అంటారు. దీనిని ‘పైరిడాక్సిన్’ మరియు ‘యాంటీ ఎనీమియా’అని కూడా అంటారు. ఈ విటమిన్ లోపిస్తే రక్తహీనత సమస్యలు వస్తాయి. హిమోగ్లోబిన్(HB)కు ఈ విటమిన్ సహకరిస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిన్.
  • పాలు ఇచ్చే తల్లుల్లో B-6- విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుంది.
  • B6- విటమిన్ లభించే పదార్థాలు: చేపలు, పిస్తాపప్పు, అరటి పండ్లు, అవకాడో, చికెన్, పాలకూర.
  • B9- విటమిన్; DNA మరియు RNA రూపొందించడానికి సహాయపడుతుంది. ప్రోటీన్ జీవక్రియకు ఉపయోగపడుతుంది, జీర్ణా ఆమ్లాల ఏర్పాటును ప్రేరేపిస్తుంది, కణజాలం మరియు కణాలు పనిచేయడానికి సహాయపడుతుంది. దీనిని ఫోలిక్ ఆమ్లం(folic acid) అని కూడా అంటారు.
  • B9- విటమిన్ లభించే పదార్థాలు; ఆకుకూరలు, చిక్కుళ్ళు, గుడ్లు, గింజలు, విత్తనాలు, అరటి పండ్లు, అవకాడో, బొప్పాయి మొదలగు వాటిలో B9-విటమిన్ అధికంగా ఉంటుంది.
  • B12- విటమిన్; కేంద్ర నాడీ మండలం సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ విటమిన్ లోపం వలన నీరసంగా నలతగా ఉంటుంది. నరాల బలహీనత ఏర్పడుతుంది. ఈ విటమిన్ లోపం వలన రక్తం తగ్గిపోతుంది, జుట్టు అధికంగా రాలిపోతూ ఉంటుంది.
  • B12- విటమిన్ లభించే పదార్థాలు: ఈ విటమిన్ మాంసాహారంలో అధికంగా ఉంటుంది.
  • C- విటమిన్; దీనిని ఇమ్యూనిటీ బూస్టర్ కూడా అంటారు. మనం వైరస్ బారిన పడినప్పుడు ఈ విటమిన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ బాగా పనిచేయడానికి C-విటమిన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. తెల్ల రక్త కణాలను ప్రేరేపించడానికి ఉపయోగపడుతుంది.
  • C- విటమిన్ లభించే పదార్థాలు: నిమ్మకాయ, నారింజ, జామకాయ, కివి, ఉసిరికాయ మొదలగు వాటిలోఁ విటమిన్ అధికంగా ఉంటుంది.
  • D- విటమిన్;ఈ విటమిన్ లోపం వలన మన శరీర ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది. పెద్దవారిలో ఎముకల సత్తువ తగ్గిపోతుంది, ఈ విటమిన్ లోపం వలన ‘రికెట్స్’ అనే వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లో సంభవిస్తుంది, ఈ విటమిన్ సూర్యరశ్మిలో అధికంగా ఉంటుంది.
  • D- విటమిన్ లభించే పదార్థాలు: పుట్టగొడుగులు, మొక్కజొన్నలు, సోయా పాలు, గుడ్లు, మాంసం, గుమ్మడికాయ, బీన్స్ మొదలగు వాటిలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది.
  • E-విటమిన్; రోగ నిరోధక శక్తిని పెంచడంలో-విటమిన్ కీలక పాత్ర పోషిస్తుంది, శరీరంలోని కణాలను కాపాడుతుంది. క్రొత్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. గుండె, నరాల బలహీనత మరియు కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఎర్ర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. సౌందర్య ఉత్పత్తుల తయారీలో-విటమిన్లు ఉపయోగిస్తారు.
  • E-విటమిన్ లభించే పదార్థాలు; చాపలు, మొక్కజొన్న, క్యారెట్లు, టమాటో, బీన్స్, చెర్రీ, బొప్పాయి.
  • K-విటమిన్; ఇది ప్రాణాలను కాపాడే విటమిన్, ఆపరేషన్ చేసే సమయాలలో డాక్టర్లు ఈ విటమిన్ ను రోగికి ఇవ్వడం జరుగుతుంది. రక్తం తొందరగా గడ్డకట్టకుండా ఈ విటమిన్ పని చేస్తుంది, పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ విటమిన్ లభిస్తుంది.
  • K-విటమిన్ లభించే పదార్థాలు; కీరదోసకాయ, ఖర్జూరం, క్యాబేజీ, కర్బుజా, ద్రాక్ష, కివి, అవకాడో మొదలగు వాటిలో విటమిన్ అధికంగా ఉంటుంది.

రోజు ఒకే రకమైన ఆహారం తీసుకుంటున్న అన్ని విటమిన్లు మనకు లభ్యం కావు, రోజు విభిన్నంగా ఆహారం తీసుకుంటుంటే మన శరీరానికి అన్ని రకాల ఖనిజ పోషక పదార్థాలు లభ్యమవుతాయి. విటమిన్ల లోపాలు లేకుండా తగిన ఆహారం తీసుకుంటే దాదాపుగా ఏ వ్యాధులు వచ్చే అవకాశం లేదు.

Leave a Comment