Look out circular against Byjus Raveendran

Look out circular against Byjus Raveendran

ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూప్ కు కస్టాలు వెంటాడుతూనే ఉన్నవి. బైజూస్ వ్యవస్థాపక సీఈఓ రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించింది. గత ఏడాది బెంగళూరులో రెండు కార్యాలయాలతో పాటు ఆయన నివాసంలో సోదాలు జరిపిన సంగతి విధితమే. అయితే ప్రస్తుతం రవీంద్రన్ దుబాయ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. Look out circular against Byjus Raveendran

ఇప్పటికే రవీంద్రన్ పై ‘ఆన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్ అమల్లో ఉంది. అంటే విదేశాలకు వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈడికి ముందుగానే సమాచారం అందజేయాల్సి ఉంటుంది తాజాగా పూర్తిస్థాయి లుకౌట్ సర్క్యులర్ జారీ అవడంతో ఇకపై దేశం విడిచి వెళ్లడానికి ఆస్కారం ఉండదు.  బైజూస్ సంస్థ ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి రూ. 6,362.35 కోట్ల లావాదేవీలు జరిగిటన్లు ఆరోపణలు ఉన్నాయి. బైజూస్ లో విదేశీ పెట్టుబుడలకు సంబంధించి నమోదైన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు ఈడీ తెలిపింది.

బైజూస్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే రవీంద్రన్ పై ఈడీ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు రవీంద్రను సీఈజి పదవి నుంచి తొలగించేందుకు కొంత మంది వాటాదారులు అసాధారణ బోర్డు, సమావేశానికి (EGM) పిలుపునిచ్చారు. కొత్త బోర్డును ఎన్నుకోవాలని వారు నిర్ణయించారు. అందుకోసం ఫిబ్రవరి 23వ తేదీ శుక్రవారం రోజున సమావేశం ఏర్పాటు చేయాలని కంపెనీని కోరారు. మరోవైపు.. వాటాదారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది బైజూస్. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఈజీఎం నిర్వహణకు అనుమతించింది. కానీ, అందులో తీసుకునే నిర్ణయాలను తదుపరి విచారణ వరకు అమలు చేయొద్దని ఆదేశించింది.

కొన్ని నెలలుగా నగదు లభ్యత సమస్యల్లో ఉన్న ఈ కంపెనీ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో బైజూస్ ఉంది.

Leave a Comment