DSC-2024 will be conduct as per regulations

DSC-2024 will be conduct as per regulations

నిభందనల ప్రకారమే డీఎస్సీ 2024 నిర్వహణ – పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్

డీఎస్సీ-2024 ను డీఎస్సీ-2018 నిభందనల ప్రకారమే నిర్వహిస్తున్నామని అభ్యర్ధులు ఎటువంటి గందరగోళం చెందనవసరం  లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. దీనికి సంభందించి బుధ వారం ఒక పత్రికా ప్రకటన ను విడుదల చేశారు. DSC-2024 will be conduct as per regulations

ప్రకటన లోని ముఖ్య విషయాలు

  • గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో సంవత్సరం రిక్రూట్మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రొస్పెక్టివ్గానే ఉంటాయిగానీ, రెట్రో స్పెక్టివ్ గా ఉండవని చెప్పారు.
  • దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్లో ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది.
  • అభ్యర్థి అప్లికేషన్ లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎందుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది.
  • డీఎస్సీ వెబ్సైట్ కు సర్వర్ సమస్య లేదు.
  • దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం.
  • ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది.
  • ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు కాబట్టి సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి.
  • అభ్యర్థులు అప్లికేషన్ ను ఎడిటి చేసుకొనే అవకాశం కల్పించాం. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు.
  • డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువు ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు వీజు చెల్లించవచ్చని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు.

For official website CLICK HERE

2 thoughts on “DSC-2024 will be conduct as per regulations”

  1. This site is incredible. The radiant material shows the administrator’s enthusiasm. I’m dumbfounded and envision more such astonishing substance.

    Reply
  2. This is an amazing page. The outstanding information reveals the owner’s accountability. I’m in awe and eagerly await more amazing postings like this one.

    Reply

Leave a Comment