Most educated countries world of statistics list

Most educated countries world of statistics list

అత్యధిక విద్యావంతులు ఉన్న దేశం ఏంటో తెలుసా?

ప్రపంచంలో అత్యధికంగా విద్యావంతులు ఏ దేశంలో ఉన్నారని అడిగితే వెంటనే అమెరికా, ఇంగ్లండ్ అంటూ చాలా మంది సమాధానం చెబుతారు. కానీ వీటికంటే అనేక దేశాలు విద్యలో ముందంజలో ఉన్నాయి. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో -ఆపరేషన్ అండ్ డెవలప్ మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో కెనడా అగ్రస్థానంలో ఉంది. Most educated countries world of statistics list

పంచితే తరగనిది ఏదైనా ఉందా అంటే అది విద్యనే. తరగడం కాదు మరింత పెరుగుతుంది కూడా. దేశాభివృద్ది ఆ దేశంలో ఉన్న విద్యావంతుల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ప్రపంచ దేశాలు సంక్షేమంతో పాటు విద్యకు అంతే ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రజలను విద్యావంతులు చేసేందుకు గాను ఎన్నో రకాల కార్యక్రమాలను చేపడుతుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా ఏయే దేశాల్లో ఎంత మంది విద్యావంతులు ఉన్నారనే విషయాలను తెలుసుకునేందుకు గాను వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. డిగ్రీ వరకు చదివిన వారిని విద్యావంతులుగా పరిగణలోకి తీసుకున్న ఈ సంస్థ జాబితాను విడుదల చేసింది. ఈ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో కెనడా అగ్రస్థానంలో ఉంది. దీని ప్రకారం, కెనడాలో 59.96% మంది విద్యావంతులు. మరియు జపాన్ 52.68% అక్షరాస్యతతో రెండవ స్థానంలో ఉంది.

అయితే అత్యధిక విద్యావంతులైన దేశాల జాబితాలో భారతదేశం టాప్ 10 స్థానాల్లో లేదు. ఒక అంచనా ప్రకారం భారతదేశ జనాభాలో కేవలం 20.4% మంది మాత్రమే ఉన్నత విద్య లేదా డిగ్రీని కలిగి ఉన్నారు. అయితే అత్యధిక విద్యావంతులు ఉన్న రాష్ట్రాల జాబితాలో కేరళ అగ్రస్థానంలో ఉంది. మొత్తం జనాభాలో 39% మంది యూనివర్సిటీ డిగ్రీ పూర్తి చేయడం గమనార్హం.

Top 8 Most-Educated Countries list

  1. కెనడా
  2. జపాన్
  3. లక్సెంబర్గ్
  4. దక్షిణ కొరియా
  5. ఇజ్రాయిల్
  6. యూఎస్
  7. ఐర్లాండ్
  8. యూకే

Read also..

Paytm Payments Bank Frequently Asked Questions and Answers

CLICK HERE

Leave a Comment