Paytm Payments Bank Frequently Asked Questions and Answers

Paytm Payments Bank Frequently Asked Questions and Answers

పేటీఎం వ్యాలెట్, పేమెంట్స్ ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఆరోపణల నేపధ్యంలో జనవరి 31న పేటీఎం పై ఆంక్షలు విధిస్తూ RBI ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28 తర్వాత కస్టమర్ల ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్ లలో డిపాజిట్లు, టాప్-ఆప్ లు  స్వీకరించరాదని RBI తన ఆదేశాల్లో పేర్కొంది. ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నగదు విత్ డ్రా చేసుకునేందుకు వీలుగా తాజాగా ఈ గడువును మార్చి 15 వరకు పొడిగించింది. Paytm Payments Bank Frequently Asked Questions and Answers

RBI ఆంక్షలు విధించినప్పటి నుంచి వినియోగదారుల్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank), వాలెట్లతో పాటు క్యూఆర్ కోడ్లు, సౌండ్ బాక్స్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు వినియోగదారుల నుంచి తరచూ ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది ఆర్బీఐ.

నగదు విత్ డ్రా ఎప్పటి వరకు చేసుకోవచ్చు ?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న నగదును 2024 మార్చి 15 తర్వాత కూడా ఖాతా ఖాళీ అయ్యే వరకు వినియోగించుకోవచ్చు. అలాగే, పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన డెబిట్ కార్డు ద్వారా నగదును విత్ డ్రా చేసుకోవచ్చు.

శాలరీ అకౌంట్ ఉంటే ఏమి చేయాలి ?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో లో శాలరీ అకౌంట్ ఉంటే మార్చి 15 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు మార్చి 15లోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

నగదు బదిలీ గానీ, సబ్సిడీ గానీ వస్తుంటే ఏమి చేయాలి ?

ప్రభుత్వం నుంచి ఆధార్ తో అనుసంధానం అయి ఉన్న నగదు బదిలీ గానీ, సబ్సిడీ గానీ వస్తుంటే అలాంటివారు కూడా నిర్దేశిత గడువులోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి.

ఆటో డెబిట్ పెట్టి ఉంటే ఏంచేయాలి ?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో నగదు ఉన్నంతవరకు ఆటో డెబిట్ (NACH)కు అవకాశం ఉంటుంది. మార్చి 15 తర్వాత నగదు పూర్తయితే ఆటో డెబిట్కు అవకాశం ఉండదు.

పేమెంట్ బ్యాంక్స్ ద్వారా ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే ?

పేటీఎం పేమెంట్ బ్యాంక్స్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉంటే మార్చి 15 తర్వాత ఖాతాలో ఉన్న నగదు పూర్తయ్యేంత వరకు మాత్రమే రెన్యువల్ కు అవకాశం ఉంటుంది.

వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ ఏమి చేయాలి ?

మార్చి 15 తర్వాత పేటీఎం వాలెట్ లో బ్యాలెన్స్ ఉన్నంత వరకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. Cash back, రిఫండ్లు మినహా ఇతరుల నుంచి కూడా నగదును పొందలేరు. కావాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ క్లోజ్ చేసి ఆ నగదును ఇతర బ్యాంకులకు పంపించుకోవచ్చు.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ పని చేస్తుందా ?

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్ ను మార్చి 15 తర్వాత అందులో బ్యాలెన్స్ ఉండేంత వరకు వినియోగించుకోవచ్చు. ఆపై రీఛార్జి చేయడం కుదరదు. కాబట్టి వేరే బ్యాంక్ నుంచి ఫాస్టాగ్ తీసుకోవడం మంచిది.

NCMC:

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన నేషనల్ కామన్ మొబిలీ కార్డుదారులు (NCMC) సైతం మార్చి 15 తర్వాత అందులోని బ్యాలెన్స్ పూర్తయ్యే వరకు వినియోగించుకోవచ్చు.

UPI:

పేటీఎం పేమెంట్స్ బ్యాంకు అనుసంధానం అయి ఉన్న యూపీఐ/IMPS ఖాతాలకు మార్చి 15 తర్వాత నగదు పంపలేరు. ఆ సమయంలో అందులో ఉన్న నగదును యూపీఐ/IMPS ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు.

క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్ లు:

పేటీఎం క్యూఆర్ కోడ్లు, పేటీఎం సౌండ్ బాక్స్ లు లేదా పీఓఎస్ టర్మినల్స్ వినియోగిస్తున్న మర్చంట్స్.. వాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అనుసంధానం అయ్యి ఉంటే.. అందులో ఎలాంటి నిధులూ జమ కావు.

మొబైల్ రీఛార్జ్ లు, బిల్లుల చెల్లింపునకు పేటీఎం వాడొచ్చా?:

అన్ని రకాల బిల్లు చెల్లింపులు, మొబైల్ రీఛార్జ్ కోసం పేటీఎం యాప్ ను ఉపయోగించడం కొనసాగించవచ్చును.  పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై నిషేధం కారణంగా ICICI, HDFC మరియు ఇతర అధీకృత బ్యాంకులకు తమ పేటీఎం లింక్ చేసిన వారిపై ప్రభావం చూపదు. పేటీఎంని ఉపయోగించి రీఛార్జ్ చేయొచ్చు. ఆర్బీఐ నిషేధం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన యూజర్లపై మాత్రమే ప్రభావం ఉంటుంది.

Detailed..

Paytm Payments Bank Frequently Asked Questions and Answers

DOWNLOAD

Leave a Comment