Mumps: Causes, Symptoms and Treatments

Mumps: Causes, Symptoms and Treatments

గవద బిళ్ళల వ్యాధి

కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో చిన్న పిల్లలకు, పెద్దవాలకు గవద బిళ్ళల వ్యాధి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు గవదబిల్లల వ్యాధి అంటే ఏంటి..? ఎక్కువ పిల్లలకు ఎందుకు వస్తాయి..?  నివారణ మార్గాలు ఇప్పుడు చూద్దాం ..

గవద బిళ్ళలు అంటే ఏమిటి?

గవద బిళ్ళలు అనే రుగ్మత. పిల్లలకు సంభవించే ఒక సాధారణమైన వైరల్ అంటువ్యాధి. చెంపలకు ఉండే లాలాజల గ్రంథులు వాచి తీవ్రనొప్పి కలిగిస్తాయి.

దీని ప్రధాన సంకేతాలు / లక్షణాలు ఏమిటి?

ఈ వ్యాధికారక సూక్ష్మజీవి సోకిన 14 నుంచి 25 రోజులకు గవదబిళ్ళల వ్యాధి లక్షణాలు గోచరించడం జరుగుతుంది.

దవడను తాకితేనే నొప్పి పుడుతుంది

తలనొప్పి

కండరాల నొప్పి

కీళ్ళ నొప్పి

దవడ ప్రాంతంలో వాపు

ఎండిన నోరు

ఆకలి లేకపోవడం

బలహీనత

వృషణాల్లో నొప్పి

గందరగోళం

చిరాకు

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పారమిక్సో వైరస్ ల యొక్క కుటుంబానికి చెందిన ఒక వైరస్ (సూక్ష్మజీవి) వలన గడ్డలు ఏర్పడతాయి. గవద బిళ్లలు నోటి నుంచి గాలి ద్వారా విస్తరిస్తాయి. తుమ్ము, దగ్గు, ఏదయినా ఎంగిలి పదార్థాలను తిన్నపుడు ఈ వైరస్ కు వాహకాలుగా పనిచేస్తాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన రెండు మూడు వారాలకు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే బయట ఫుడ్ తినడం వల్ల కూడా ఈ వ్యాధి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఇతర వ్యక్తులకు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే వ్యాధి సోకిన వ్యక్తి తుమ్ముతున్నపుడు మరియు దగ్గుతున్నప్పుడు నోటికి మరియు ముక్కుకు అడ్డంగా చేతిరుమాలు ఉంచుకోవడం చాలా ముఖ్యం.

దీన్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

గవదబిళ్ళలు రాకుండా ఉండేందుకు టీకాలమందు వేసిన చరిత్రను గుర్తించడం.

ముఖ్యంగా గొంతు మరియు చెవులు యొక్క భౌతిక పరీక్ష

సూక్ష్మజీవిని గుర్తించి నిర్ధారించేందుకు, సూక్ష్మజీవికి వ్యతిరేకంగా ప్రతిరక్షకాలను గుర్తించడానికి రక్త పరీక్ష.

సూక్ష్మజీవిని నిర్ధారించడానికి ముఖ జీవకణ (నోటికి సంబంధించిన) స్వాబ్ పరీక్ష

మూత్ర పరీక్ష

చికిత్స

గవదబిళ్ళల వ్యాధి ఒక వైరస్ వల్ల సంభవించినందున యాంటిబయోటిక్స్ మందులు దీనికి ప్రభావవంతంగా పని చేయవు. జ్వరం, గొంతు, తలనొప్పి ఉంటుంది. ఈ పిల్లలు ఇతరులతో కలవకుండా ఇంట్లో విశ్రాంతి ఇవ్వాలి. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది. మంచి పోషకాహారం తీసుకోవాలి.

సంక్రమణ వ్యాప్తిని నిరోధించడానికి రోగిని ఇతరుల నుండి వేరుచేయడం

జ్వరము కొరకు పారాసెటమాల్ మందులు

వాపు కోసం ఇబుప్రోఫెన్

వాపు కోసం వెచ్చని కాపడం లేదా చల్లని అద్దకాలు

నమలడం అవసరమైన ఆహారాన్ని నిరోధించి మృదువైన ఆహారం రోగికి తినిపించడం ఉత్తమం

ద్రవాహారాల్ని పుష్కలంగా తీసుకోవడం

నివారణ ఒకసారి గవదబిళ్ళలు వచ్చిన వారికి మళ్ళీ రావు. ఇది జీవితకాలం వ్యాధి నిరోధక శక్తినిస్తుంది. చిన్న పిల్లలలో ఎవరికైతే గవదబిళ్ళలు రాలేదో వారికోసం టీకాలు వున్నాయి. పిల్లలకు మశూచికం (మీసల్స్), గవదబిళ్ళలు (ముంప్స్), పొంగు రుబెల్లా (MMR) టీకాలను ఇప్పించడం ద్వారా కొంతమేర గవద బిళ్లలను నియంత్రించవచ్చు. ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో ఇస్తారు. తొలి డోసును 9 నుంచి 12 నెలల మధ్యలో.. రెండో డోసును12 నుంచి 15 నెలల మధ్యలో ఇస్తారు. టీకామందు సిఫార్సు చేయబడింది. జ్వరంతో బాధ పడుతున్న పిల్లలకు గర్భిణి స్త్రీలకు ఈ టీకాలు ఇవ్వరాదు.

Leave a Comment