ఊహించనంత తక్కువ రేట్ కి వస్తుందని ఆన్లైన్ లో చీరలు కొంటున్నారా? అయితే నిక్షేపంగా కొనుక్కోండి కాకపోతే ఆ చీరలు అమ్మే కంపెనీ మంచిదా కదా అనేది గుర్తించి అప్పుడు కొనుక్కోండి. అలా గుర్తించని ఒక ఇల్లాలిని ఆన్లైన్ లో ఎలా మోసం చేసారో తెలుసా...
ప్రతీరోజు ఇంట్లో ఉండే చాల మంది ఆడవాళ్లు వంట అంతా పూర్తిఅయ్యాక తీరికగా సెల్ ఫోన్ చూసుకుంటారు అది చాలా మాములు విషయం. ఇంతకీ అందులో ఎక్కువగా చుసేవి ఆన్లైన్ షాపింగ్ ఎందుకంటే ఆడవాళ్ళకి అన్నింటికన్నా ఇష్టం అయినవి ఎక్కువ ఇంట్రెస్ట్ అండ్ టైం కేటాయించి మరీ కొనేవి సారీస్ మరియు నగలు.
అలా చూస్తున్నప్పుడు ఏదైనా నచ్చిన సారీ కనిపించిందా అది వెంటనే ఆర్డర్ చేసుకునే వారు కొందరైతే, మరికొందరు ఇంట్లో వారితో మరియు పక్కింటి వారితో చర్చించి ధర సరసంగానే అనిపిస్తే ఆర్డర్ చేసుకునే వారు మరికొందరు.
అయితే ఇదంతా మాములుగా జరిగే విషయమే అయినప్పటికీ.. ఇలాంటి ఆడవాళ్ళలో కాస్తఅంత అమాయకులను టార్గెట్ చేస్తూ సరికొత్త ప్లాన్స్ తో మోసగ్గాళ్లు ముందుకు వచ్చారు ఇంతకీ ఏమిటి ఆ సరికొత్త మోసం?
గుంటూరు జిల్లా పెద్దనంది పాడు గ్రామం లో ఓ ఇల్లాలు బాగా తక్కువ ధరకి వస్తుందని
ఆన్లైన్ లో చీరని ఆర్డర్ పెట్టింది
4 రోజుల తరువాత పారిసిల్ వచ్చింది
డబ్బులు కట్టేసి చీర పారిసిల్ ఓపెన్ చేసిన ఆ ఇల్లాలికి అందులో చీర తో పాటు ఓ వివరాలు ఉన్న పోమ్ప్ లెట్ అలాగే ఓ స్క్రాచ్ కార్డు కనపడింది. అయితే మేటర్ అంట ఇంగ్లీష్ లో ఉండటం తో వాటిని ఓ పక్కన పెట్టేసింది, తర్వాత ఒక వారం గడిచింది ఓ రోజు ఆమెకు ఎక్కడినుంచో ఓ ఫోన్ వచ్చింది. మేము పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం మదం మా కంపెనీ చీర కొన్నందుకు మీకు ధన్యవాదాలు. అతి తక్కువ ధరలకు మీకు ఇలాగే మంచి మంచి చీరలను అందిస్తాము అంటూ తెలిపాడు.
అన్నట్టు చీర తో పాటు మీకు ఒక స్క్రాచ్ కార్డు వచ్చింది అందులో మీకు ఒక బహుమతి కానీ, లేదంటే కొంత మనీ కానీ ఉంటుంది. దాన్ని స్క్రాచ్ చేసి బహుమతి ఉంది లేదో చెప్తారా మదం అంటూ బ్రతిమాలాడటం మొదలుపెట్టాడు. దీంతో ఆ ఇల్లాలు పక్కన పెట్టేసిన స్క్రాచ్ కార్డు ని తీసి ఒక పిన్నీసుతో దాన్ని దాన్ని గీకేసినది. వెంటనే ఆశ్చర్యం ఆ స్క్రాచ్ఒ కార్డు మీద కటి రెండు కాదు ఏకంగా 13,50,000/- రూపాయలు బహుమతిగా వచ్చినట్టు ప్రింట్ అయి ఉంది. ఇంకేముంది ఆ విన్గ్ అమౌంట్ చూసి ఆ ఇల్లాలికి ఒక్కసారిగా కళ్ళు తిరిగాయి.
వెంటనే ఫోన్ చేసిన ఆ వ్యక్తి కి ఆ విషయం తెలియచేసింది. వెంటనే ఆ మోసగాడు మేడం మీకు కంగ్రాట్యులేషన్స్ అంటూ 1300/- రూపాయిల చీర కొని 13 లక్షలు గిఫ్ట్ మీరు పొందారు అంటూ, వెంటనే మీ బ్యాంకు అకౌంట్ నెంబర్ అలాగే మీ ఆధార్ కార్డు నెంబర్ మీ ఇంటి అడ్రస్ వివారాలు ఇవ్వండి దానితో పాటుగా ప్రొసెస్సింగ్ ఫీజ్ 13,500/- మాకు పంపించండి వెంటనే మీరు గెలుచుకున్న 13,50,000/- రూపాయలకు మీకు చెక్ పంపిస్తాము అంటూ చెప్పాడు.
ఆమెకి అతని మాటలు చాల నమ్మకంగా అనిపించి వెంటనే అతని మాటలు నమ్మి ఆ వ్యక్తి చూపిన నెంబర్ కు ఆన్లైన్ ట్రాస్ఫర్ చేసింది, అంతే అక్కడి నుంచి మొదలు ఫ్లయిట్ ఛార్జ్, మానేజ్మెంట్ ఛార్జ్ అంటూ రకరకాల కారణాలు చెప్పి ఎలాగయితే మొత్తంగా ఆమె దగ్గరి నుంచి అక్షరాలా 1,70,000/- రూపాయిలు దోచుకున్నారు.
చివరిగా ఆ వ్యక్తి చెప్పిన మాటలు Thank you మేడం మీరు గెలుచుకున్నమొత్తం అమౌంట్ మీకు 3 వర్కింగ్ డేస్ లో వస్తుంది అని చెప్పాడు.
3 రోజులు కాదు 3 వారాలు గడిచి పోయాయి, ఆ వ్యక్తి నెంబర్ కి ఫోన్ చేస్తే ఫోన్ స్వీచ్ ఆఫ్ వస్తుంది. చేసేది ఏమి లేక పోలీస్ కంప్లైంట్ చేసింది, పోలీసఎక్వేరీ చేస్తున్నారు.
ఇంతకుముందు కూడా ఇలాంటి మోసాలు చాలా జరిగాయి. కానీ అప్పుడు ఫోన్ కి MSG లు వచ్చేవి. ఇప్పుడు అలా కాకుండా ఈ మోసగాళ్లు స్క్రాచ్ కార్డు రూపంలో అమాయకపు ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు.
Comments