Akhay Kumar Guinness Record: సెల్ఫీలతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన హీరో అక్షయ్ కుమార్

 బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన రాబోయే కామెడీ సినిమా "సెల్ఫీ" ప్రమోషన్‌ను క్రొత్తగా ప్రారంభించాడు. అలా చేస్తూనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా కైవసం చేసుకున్నాడు.

 


 బుధవారం అక్షయ్ మూడు నిమిషాల వ్యవధిలో అత్యధిక సెల్ఫీలు తీసిన రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు. ముంబైలో జరిగిన "సెల్ఫీ" చిత్ర ప్రచార కార్యక్రమంలో ఈ ఘనత పూర్తయింది..

తన అభిమానులు మరియు గిన్నిస్ సిబ్బంది సమక్షంలో ఫోటోలు మరియు వీడియోలు తీస్తూ  Instagram లో పోస్టు కూడా చేసాడు. 

‘నమస్తే’ అంటూ అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ ఇలా వేగంగా సెల్ఫీలను క్లిక్ చేస్తున్న వీడియో నేట్టింట హల్చల్ చేస్తుంది..మొత్తంగా అతను 184 సెల్ఫీ ఫోటోలను క్లిక్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ హోల్డర్‌గా నిలిచాడు. 


 

దీనికి అతను తన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పోస్టును కూడా షేర్ చేసాడు. తన కెరీర్‌లో ఆటు పోట్లలో తనకు అండగా నిలిచిన వారికి ఈ రికార్డ్ను  అంకితం ఇస్తున్నట్లు అక్షయ్ కుమార్ వెల్లడించారు.

రాజ్ మెహతా నిర్మించిన రాబోయే చిత్రం సెల్ఫీ విడుదలకు కొద్ది రోజుల ముందు ఈ మైలురాయిని సాధించారు. అక్షయ్ కుమార్‌తో పాటు, ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, నుష్రత్ భరుచ్చా మరియు డయానా పెంటీ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ  కామెడీ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ మరియు సూరజ్ వెంజరమూడు నటించిన 2019లో విడుదలైన మలయాళ చిత్రం డ్రైవింగ్ లైసెన్స్‌కి రీమేక్.  

శుక్రవారం ఫిబ్రవరి 24న సెల్ఫీ వెండితెరపైకి రానుంది.

Post a Comment

Comments