Gudivada: విలువైన ఖరీదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నరికివేత…

 గుడివాడ : 

విలువైన ఖరీదైన ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నరికివేత…

అడిగితే ఎమ్మెల్యేకి చెప్పి చేశాం అంటూ బుకాయింపు  …

గుడివాడ నడిబొడ్డున శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ఆవరణలో విలువైన మొక్కలు, చెట్లు నరికివేత…

ఆలయానికి ప్రక్కనే కళ్యాణ మండపం నిర్మించిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి…

కళ్యాణ మండపం సరిహద్దు గోడ ప్రక్కన దేవస్థాన సరిహద్దులు మరుగుదొడ్ల నిర్మాణం చేసిన దేవాలయ అధికారులు..

మరుగుదొడ్లకు దేవాలయానికి మధ్య ఖాళీ ప్రదేశంలో ఎన్నో విలువైన, ఖరీదైన,ఔషధ గుణాలు కలిగిన మొక్కలను పెంచుతున్న దేవాలయ నిర్వాహకులు…

తనది కానీ దేవస్థానానికి చెందిన భూమిలో చెట్లను నరికించిన కళ్యాణ మండపం యజమాని…

కాళీ ప్రదేశంలో పెరిగిన చెట్ల కారణంగా స్వచ్ఛమైన గాలిని పొందుతున్నామని అంటున్న భక్తులు…

హఠాత్తుగా చెట్లు,మొక్కలు నరికించాల్సిన అవసరం ఏంటని మీకు ఎవరు అనుమతులు ఇచ్చారని కల్యాణ మండపం యజమానిని నిలదీసిన భక్తులు…

ఆలయ నిర్వాహకులపై భక్తులపై మాటల దాడి చేసిన కళ్యాణమండపం యజమాని…

ఎమ్మెల్యే కి చెప్పి నరికాను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ బెదిరింపులకు దిగిన వైనం…

దేవాలయ భూమిని కబ్జా చేసే ఆలోచనలో సదరు కల్యాణ మండపం యజమాని…

టేకు వంటి విలువైన చెట్లను నరికేందుకు అటవీశాఖ అనుమతులు తప్పనిసరి…

చెట్లను నరికిన ప్రదేశంలో కళ్యాణమండపం కోసం వంటశాలను నిర్మించే ఆలోచనలో యజమాని…

దేవుని సన్నిధిలో కళ్యాణ మండపం కోసం మాంసాహారం వండినా అడిగే వారెవరు…?

ఎంతో విలువైన చెట్లను నరకడంతో మనోవ్యదకు గురవుతున్న వృక్ష ప్రేమికులు…

కళ్యాణ మండపం యజమాని దుశ్చర్యలను ఖండిస్తూ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించిన భక్తులు…

Leave a Comment