గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న పరిస్థితి ఇప్పుడు అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో వైద్యులు హెల్త్ బుల్లిటెన్‌ను విడుదల చేయనున్నారు.
తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిపాలైన నందమూరి తారకరత్న ఆరోగ్య అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్లుగా సమాచారం అందుతోంది. ఇంతకాలం ఆయన కొలుకుంటున్నారని భావించినా.. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారినట్లు తెలుస్తోంది. గత 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నకు విదేశీ వైద్యులతో సైతం చికిత్స అందితస్తున్నారు. మధ్యలో కాస్త కోలుకున్నట్లు కనిపించినా.. మళ్లీ అదే పరిస్థితి నెలకొన్నట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మరికాసేపట్లో సాయంత్రం 4.30 గంటలకు తారకరత్న ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు వైద్యులు ప్రకటించారు. తారకరత్న ఆరోగ్యంపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో బాలకృష్ణ, తారకరత్న కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకున్నారు.
తారకరత్న పరిస్థితి బాగా లేదని తెలుసుకున్న బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఇప్పుడు బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు చేరుకున్నట్టుగా సమాచారం అందుతోంది.
వైద్యానికి తారకరత్న స్పందించడం లేదని వైద్యులు తేల్చి చెప్పిట్లుగా తెలుస్తోంది.కుటుంబసభ్యులు అందరినీ హుటాహుటిన హాస్పిటల్ కు రావల్సినదిగా వైద్యులు కోరినట్లు తెల్లుస్తోంది.
పూర్తి సమాచారం కాసేపట్లో...
Comments