టీడీపీ అధినేత చంద్రబాబు చట్టాలను గౌరవించకుండా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు.
సైకోలు ఎలా ప్రవర్తిస్తారో నిన్న చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చూశామని చెప్పుకొచ్చారు. ఆయన సైకోలా ప్రవర్తిస్తున్నారని..మతిస్థిమితం తప్పిందని విరుచుకుపడ్డారు. ఆ విషయం ప్రజలకూ అర్థమైందన్నారు. ప్రతిపక్ష పార్టీని ప్రజలు ఛీకొడుతున్నారని తెలిపారు.
కొడుకు పాదయాత్ర ఎక్కడా ప్రజాదరణ లేక ఘోరంగా విఫలమవడంతో చంద్రబాబు మానసిక క్షోభకు గురవుతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దిక్కు తోచని బాబు చట్టాలను గౌరవించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబుకు వయసు మీద పడి.. మతి భ్రమించిందని ఎద్దేవా చేసారు. అందుకే చట్టాలను అతిక్రమిస్తూ సైకోలా మారారంటూ వ్యాఖ్యానించారు. చివరకు తనకు రక్షణ కల్పించే పోలీసులనూ గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. పోలీసులను వారిని నిందిస్తున్నారని.. చట్టాలు అతిక్రమిస్తున్న చంద్రబాబు ఒక సంఘ విద్రోహిలా మారుతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తే మాత్రం కుదరని స్పష్టం చేసారు.
Comments