📚✍️నేటి నుంచి ఎస్ఏ-2 పరీక్షలు✍️📚

 🌻కంకిపాడు(పెనమలూరు): ఉమ్మడి కృష్ణా జిల్లాలో విద్యాశాఖ ఆదేశాలతో గురు వారం నుంచి ఎస్ఏ-2 పరీక్షలు ప్రారం భంకానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ఈ దఫా పైలెట్ సర్వే కింద ఎంపిక చేసిన ప్రైవేటు/ఎయిడెడ్ పాఠశాల ల్లోనూ ప్రభుత్వం నిర్దేశించిన విధానం లోనే పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఇతరప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థు లకు ఎస్ఏ-2 పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ల ద్వారా పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ దఫా కూడా ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులు క్లాస్రోూం బేస్డ్ అసె స్మెంట్ నిర్వహిస్తారు. వారందరికీ ప్రశ్నప త్రంతో పాటుగా ఓఎంఆర్ షీట్లు ఇస్తారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు మాత్రం పదో తరగతి విద్యార్థులు మాదిరిగా ఎస్ఏ-2 పరీక్ష రాయాల్సి ఉంది..

♦️ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల ఎంపిక ఈ దఫా విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలకు కేవలం ప్రశ్న పత్రాన్ని మాత్రమే పంపుతుంది. ఆయా పాఠశా లలు తమ విద్యార్థులతో పరీక్ష రాయించి మూల్యాంకనం చేసి ప్రతిభ నివేదికలను జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం, జిల్లా విద్యాశాఖకు పంపాల్సి ఉంది. ఇందుకు గానూ కృష్ణా జిల్లాలో 68, ఎన్టీఆర్ జిల్లాలో 51 ప్రైవేటు/ఎయిడెడ్ పాఠశా లలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన ప్రశ్నాపత్రం ఓఎంఆర్ షీట్లను కూడా మండల స్థాయిలో ఎంఆర్సీ ద్వారా అందించారు. ఎస్ఏ-2ను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సట్లు జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం కార్య దర్శి ఉమర్ అలీ తెలిపారు.

Leave a Comment