మెకాళ్ళ నొప్పులు తగ్గి, నరాల శక్తి పెరిగి, శరీరంలోని ఇతర నొప్పులు తగ్గి హుషారుగా నడవాలంటే ఎం చెయ్యాలి?


For joint pains  , please use below medicine for 6 to 7 months to cure your problem….

Sciatica pains, Knee Pains, Cartilage to get in knees,, Bones strenth, ligaments cure and stiffness,  Osteo artheritis, Rhuematiod artheritis,  muscle strength, Body fitness and for all types of pains.

మెకాళ్ళ నొప్పులు పొవడానికి, నరాల శక్తి పెరగడానికి, శరీరంలోని ఇతర నొప్పులు తగ్గి హుసారుగా నడవడానికి:

చిత్రమూలాది కసాయం:— 

రెమెడీ: – 

చిత్రమూలం వేర్ల పొడి   100గ్రా

అస్వగంధ వేర్ల పొడి       100గ్రా

శతావరీ  పొడి                 100గ్రా

పల్లేరు పొడి                     100గ్రా

బూరుగ జిగురు                100గ్రా

తుమ్మజిగురు                   100గ్రా ( ఇది పెనము మీద దోరగా వేయించినది మాత్రమే వేసుకొవాలి)

బాదాం జిగురు                   100గ్రా

రావి జిగురు                        100గ్రా

శొంటి పొడి                           100గ్రా

వాము పొడి                         100గ్రా

లోహా భస్మం                          20గ్రా

మండూర భస్మం                    20గ్రా

ఇంగువ పొడి                            10గ్రా ( LG  కంపెనీ వాడుకొవాలి) కేవలం స్వచ్చమైన ఇంగువ అయితే 3 గ్రాములు వేయాలి.

ఈ అన్ని వస్తువులు తీసుకొని భాగా పొడి చేసుకొని అన్నీ కలిపి ఒక సీసాలొ భద్రపరుచుకొని, ఉదయం ఒక  స్పూన్, మధ్యాహ్నం ఒక స్పూన్ రాత్రి ఒక స్పూన్, భోజనానికి ముందు నీటితో  తీసుకొవాలి లేదా ఆవు మజ్జిగలో లేదా ఆవు పాలల్లొ తీసుకొవచ్చును.  ఇలా చేయడం వల్ల శరీరంలో నొప్పులు తగ్గి శక్తి పెరిగి, మెకాళ్ళల్లో జిగురు పెరుగుతుంది.

ఎక్కువగా మెకాళ్లల్లో జిగురు అరిగిపొయివుంటె ఈ క్రింది విధంగా కూడా పాటించాలి.

రెమెడీ:  1,  బీజ్ బంద్ అనే గింజలు (ఇవి గసగసాలలాగా చిన్నవిగా వుండును ఇవినోటిలో వేసుకొంటే జిగటగా వుండును ఇవి ఎముకల శక్తికి మెకాళ్ళ జిగురు పెరుగుదలకి మంచివి.)

2,” నీరు గొబ్బిగింజలు” ఇందులో రెండు రకాలు వున్నాయి ఒకటి రాగులు వలే పొలి పై గింజలులాగే నోటిలో వేస్తే జిగురుగా వుండును రెండవది మహాభీరవిత్తనాలు అని కూడా అంటారు ఇవి నల్లగా పెద్దవిగా వుండును ఈ క్రింద చెప్పబడినది. 

3,” మహా భీర విత్తనాలు” ఇవి నల్లనువ్వులకన్నా పెద్దసైజ్ లో వుండి నోటిలో వేసుకొంటే జిగురు కలిగించును పై వాటిలాగానే

4,  చియా సీడ్స్ ఇవి చిన్న సాసవలు వలే చిన్నవిగా మ్రుదువుగా వుండును ఇవికూడా నోటిలో వేసుకొంటే జిగురుగా కలుగును 

ఈ నాలుగు రకాల గింజలు మీరు సమానంగా తీసుకొచ్చి అనగా ఒక్కోక్కటి 100గ్రాలు చొప్పున తెచ్చి ఇందులో చెత్తవంటివి తీసి అన్నీ కలిపి ఒక సీసాలో వుంచి, మధ్యాహం బోజనానికి ముందు సాయంత్రం ఈ రెండు సమయాల్లో ఈ గింజలు అన్నీ కలిపినవి సుమారు ఒకటిన్నర స్పూన్ అర్దగ్లాస్ నీటిలో వెసి 10 నిముసాలు నానిస్తే ఇవి అన్నీకూడా మెత్తగా అవిపొవును, వీటిని నీటితో సహా మీరు త్రాగాలి, ఇలా చేయడం వల్ల మీ ఎముకలు బలంగా మారుతాయి, మీ మెకాళ్ళల్లో, జాయింట్లల్లో, జిగురు అరిగిపొయినా మళ్ళీ జిగురు పెరుగుతుంది, ఎమకలు ద్రుడంగా మారుతాయి, శక్తి పెరుగుతుంది, నొప్పులు తగ్గుతాయి, కండపుస్టి కలుగుతుంది. ఇలా మీరు మీ సమస్య పొయెంతవరకూ మీరు ఈ విధంగా చేసుకొని వాడండి, మీరు చేసుకొని వాడి మేలుపొంది, మీ తోటివారికి చెప్పి సహాయపడండి. ఈ చెప్పిన గింజలు అన్నీ దొరక్కపొయిన దొరికిన వాటితో మీరు వాడి మేలు పొందగలరు.

నొప్పులున్న అందరూ చేయాల్సిన పత్యం : food restriction for those who are having pains.

పత్యం: అరటికాయ, బంగాళ దుంపలు, చేమదుంపలు, చిలగడదుంపలు, చెరుకుపాలు, చికెన్, కుందేలు మాంసము, గుమ్మడికాయ, అరటిపండు, మెక్కజొన్నలు,  మెదలైనవాత వస్తువులు లేదా వాయు వస్తువులు తీసుకోకూడదు

ఇది మీరే కాదు నొప్పులున్న అందరూ తీసుకొకూడదు.

Leave a Comment