ఫ్రాన్స్ లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు

పారిస్: దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ గురు వారం అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు ఆమోదం పొందాల్సిన అవసరం లేకుండా తన అసాధా రణ అధికారాలను వినియోగించి ఉద్యోగుల పదవీ విర మణ వయసును 62 నుంచి 64 ఏళ్లకు పెంచారు. 

ఈ ప్రతిపాదనకు పార్లమెంటు దిగువ సభ ఆమోదం లభి స్తుందన్న నమ్మకం లేకపోవడంతో మెక్రాన్ ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ చర్యపై విపక్షాలతో పాటు స్వపక్షం నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. పింఛను పథ కంలో మార్పులు చేయనుండడంతో ఇప్పటికే దేశవ్యా ప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దీనికి తోడు రిటైర్మెంట్ వయసు పెంచడంతో మెక్రాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షాలు నిర్ణయిం చాయి. 

దేశ ప్రజల సగటు జీవన కాలం పెరగడంతో పింఛను భారం అధికమవుతోందని ప్రభుత్వం భావి స్తోంది. దీంతో పదవీ విరమణ వయసును పెంచింది. పూర్తిస్థాయి పింఛనుకు అర్హత పొందాలంటే కనీస సర్వీసు 43 ఏళ్లు ఉండాలన్న నిబంధన విధించనుంది.

Leave a Comment