📖 మన ఇతిహాసాలు 📓

 నకులుడు (మహాభారతంలో పాండవులలో నాలుగో వాడు) నకులుడు పాండవ వాల్గవవాడు. మహాభారత ఇతిహాసములో అశ్వనీ దేవతల అంశ. పాండు రాజు సంతానం. మాద్రికి దూర్వాసుని మంత్ర ప్రభావం మూలంగా అశ్వనీ దేవతలకి కలిగిన సంతానం. హస్తినాపురంలో జీవితం నకులుడు అనగా వంశంలో చాలా అందంగా ఉండేవాడని అర్థం. అతను మన్మధుని వలె చాలా అందమైనవాడు. అతను కత్తి యుద్ధంలో గొప్ప వీరుడు, గుర్రాల కళలో నైపుణ్యం కలిగి ఉండేవాడు. ప్రవాసం కౌరవులతో జరిగిన పాచికల ఆటలో యుధిష్ఠిరుని … Read more

అశోకుడికి కర్తవ్యం: హితోపదేశం

రెండువేల సంవత్సరాల క్రిందటి మాట. అశోక చక్రవర్తికి విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేది. దురాశ కొద్దీ ఆయన చిన్న రాజ్యమైన కళింగపై దండెత్తాడు. అయితే ఆయన ఊహించనంత పెద్ద యుద్ధం జరిగింది. కళింగవీరులు ఎందరో రాజ్య రక్షణ కోసం ప్రాణాలు ధారపోసారు తప్ప ఓటమిని మాత్రం అంగీకరించలేదు. ఆ వీరయోధుల రక్తం ఏరులై ప్రవహించింది. యుద్ధభూమి మొత్తం కళేబరాలతో నిండిపోయింది. అవయవాలు తెగి పడి ఉన్నాయి- నెత్తురు మడుగులు… ఇదంతా చూసిన అశోకుడు ఆలోచనలో‌ పడ్డాడు. “తను చేసింది … Read more

Moral Stories: కుటుంబం విలువ చెప్పే గాలిపటం కథ…

 🔸తండ్రీ కొడుకులు మేడపైకి ఎక్కి గాలిపటం ఎగరేస్తున్నారు. 🔸గాలిపటాన్ని ఎలా ఎగరేయాలో తండ్రి పిల్లవాడికి నేర్పిస్తున్నాడు. గాలిపటం బాగా ఎత్తుకు వెళ్లాక, దారాన్ని కొడుకు చేతికి అందించాడు తండ్రి. 🔸కొడుకు ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఆ వెలుగులో తండ్రి మనసు ఉప్పాంగి పోయింది. కొంతసేపు దారాన్ని చేత్తో పట్టుకున్నాక కొడుకు తండ్రిని అడిగాడు. 🔸”నాన్నా దారంతో పట్టి ఉంచితేనే గాలిపటం అంత ఎత్తుకి ఎగిరిందే! దారాన్ని తెంపేస్తే ఇంకా ఎత్తుకు ఎగిరిపోతుంది కదా” అన్నాడు. 🔸తండ్రి నవ్వాడు. … Read more

మన ఇతిహాసాలు: భీమ మరియు బకాసుర కథ

పాండవులు తన తల్లితో కలిసి ప్రవాసంలో ఉన్నారు. వారు ఉండటానికి ఒక ప్రదేశం కోసం వెళ్ళుతున్న సమయంలో, వారు ఒక నిశ్శబ్ద గ్రామం చేరుకున్నారు. ఆ గ్రామంలో పాండవులకు ఒక బ్రాహ్మణ గ్రామస్థుడు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడుకి ఒక పెద్ద కుమార్తె మరియు ఒక చిన్న పిల్లవాడు ఉండెను. కొన్ని రోజులు ప్రశాంతంగా మరియు ఆనందంగా గడిపారు. ఒకరోజు తల్లి కుంతీ బ్రాహ్మణ ఇంటి నుంచి వస్తున్న ఏడుపును వినెను. ఆమె అక్కడ … Read more

Telugu Stories: ఒంటె జాడ తెలిసిందిలా!

 ఒకరోజు తెనాలి రామకృష్ణుడు అడవి గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. దారిలో ఒక వ్యాపారి ఆయనను ఆపి, నేను దారి తప్పిపోయిన నా ఒంటెను వెతుకుతున్నాను. దారిలో నీకు ఏమైనా కనిపించిందా? అని అడుగుతాడు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ ఒంటె కాలికి గాయమైందా! అంటాడు. అవును. అంటే మీరు నా ఒంటెను చూశారన్నమాట అంటాడు వ్యాపారి. నేను ఆ ఒంటె పాదముద్రలు మాత్రమే చూశాను. చూడండి ఆ మూడు పాద ముద్రలు. ఒక కాలికి గాయం అవడం … Read more

Telugu Stories: బతుకుబాట — చందమామ కథలు

ప్రత్తిపాడులో నివసించే కనకమ్మకు, సత్తెయ్య ఏకైక సంతానం. లేకలేక పుట్టిన కొడుకని అపురూపంగా పెంచింది. వాడికి అయిదేళ్ళు తిరగకుండానే తండ్రి హఠాత్తుగా కాలం చేయడంతో, తల్లివాణ్ణి మరింత గారాబంగా చూసుకోసాగింది. సత్తెయ్య స్వతహాగా మంచివాడేకానీ, చుట్టూ చేరిన దుర్వ్యసనపరులైన స్నేహితుల కారణంగా వృథా ఖర్చులు పెడుతూ, ఉన్న కాస్త ఆస్తిని కర్పూరంలా కరిగించసాగాడు. తల్లి హితబోధలు వాడి తలకెక్కేవికావు. వాడికి ఇరవయ్యేళ్ళు వచ్చేసరికి, కొడుకు ఎలా బ్రతుకుతాడో అన్న దిగులుతో కనకమ్మ కూడా కన్నుమూసింది. ఆ తర్వాత … Read more

Moral Stories: పిసినారి పిచ్చమ్మ

భర్త చనిపోయిన పిచ్చమ్మకు ఊళ్లో దంతె దూలాలతో కట్టిన ఒక పాత ఇల్లు, కొంత పొలం ఆస్తిగా సంక్రమించాయి. వాటికి తోడు నాలుగు బర్రెలు. ఈ ఆస్తితో ఆమె తన ముగ్గురు కూతుళ్లనీ పోషించుకోవాల్సి వచ్చింది. పిచ్చమ్మకు నోటి దురుసు. దానికి పిసినారితనం తోడయ్యేసరికి ఆమె ఖ్యాతి త్వరగానే విస్తరించింది. ఆమె తనదగ్గరున్న ధాన్యాన్నికూడా వడ్డీలకు తిప్పుతూ, కూతుళ్లు పెద్దవాళ్ళయ్యే సరికి బాగానే డబ్బులు వెనకేసింది. ఎవరైనా బాకీదార్లు సకాలానికి బాకీ చెల్లించకపోతే వారిపై యుద్ధం ప్రకటించి … Read more

Moral Stories: అబద్దం తెచ్చిన అనర్థం

జగన్నాధం, శారదాదేవి దంపతుల ఏకైక కుమారుడు వాసు. వాసు కొంటెకుర్రవాడు. అల్లరి చిల్లర పనులు చేస్తే స్కూలుకి డుమ్మాలు కొట్టేవాడు. తల్లిదండ్రులకు ఇవన్నీ తెలిసేవికావు. ఒకరోజు వాసు స్కూలుకి ఎగనామంబెట్టి ఒక సైకిలు అద్దెకు తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. అనుకోకుండా సైకిలు ఒక రాయికి గుద్దుకొని సైకిలు కిందపడి వాసుకి సైకిలు బ్రేక్స్ గుచ్చుకొని రక్తం కారుతుంది. ఎలాగో లేచి కుంటుకుంటూ వెళ్ళి సైకిల్‌ను షాపు యజమానికి ఇచ్చాడు.  ఆ షాపు యజమాని జరిగినదంతా తెలుసుకొని బాబూ! … Read more

Moral Stories: పిసినారి ఊరు

రామాపురంలో గత ఐదేండ్లుగా అసలు వర్షాలే పడటం లేదు. ఆ ఊరి పెద్ద అయిన రామయ్యకు ఇది చాలా బాధ కలిగిస్తోంది. అతనికి రాత్రిపూట నిద్ర కరువైంది. ఊరి ప్రజలు కష్టాల పాలవ్వటం అతన్ని కలచివేస్తున్నది. ఒకనాడు వర్షాకాలంలో అతనికి ఒక కల వచ్చింది. కలలో వెంకటేశ్వర స్వామి కనబడ్డాడు. “మీ ఊరి ప్రజలంతా కలిసి నాకు పాలతో అభిషేకం చేస్తే మీ ఊరికి తిరిగి వర్షాలు వచ్చేలా చూస్తాను” అని అభయమిచ్చాడు స్వామి. రామయ్య మరునాడు … Read more

Moral Stories: అక్బర్ బీర్బల్ కథలు

 ఒక సారి అక్బర్ చక్రవర్తి, బీర్బల్ తో బాటు కొంత సైన్యంతో ప్రక్కనున్న ప్రాంతాన్ని సందర్శించడానికి బయలుదేరాడు. ప్రయాణ సమయంలో బీర్బల్ తన పెదవులు అదే పనిగా కదుపుతూ ఉండడం గమనించి,”ఏం చేస్తున్నావు,బీర్బల్?” అని అడిగాడు. అందుకు బీర్బల్, “రామనామం స్మరిస్తున్నాను,జహాపనా!అలా చేయడం నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఆచారం” అన్నాడు.  బీర్బల్ దైవభక్తికీ,సంస్కారానికి అభినందించాడు అక్బర్.        కొంతదూరం ప్రయాణించాక, అక్బర్,బీర్బల్ తమ సైన్యం నుండీ విడిపోయి దోవ తప్పి పోయారు.బాగా ప్రొద్దెక్కింది. ఇద్దరికీ … Read more