Guntur kaaram is coming on Netflix

 


Guntur kaaram ott: ఓటీటీలో 'గుంటూరుకారం'

మహేష్ బాబు, శ్రీలీల మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చని 'గుంటూరు కారం' ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

మహేశ్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా "గుంటూరుకారం" (Guntur Kaaram) ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లెక్స్ లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ 'గుంటూరు కారం' అందుబాటులోకి రానుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. సినిమాటోగ్రఫీ పి.ఎస్.వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి నిర్వహించారు.

ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే వైరా వసుంధర (రమ్యకృష్ణ), రాయల్ సత్యం (జయరామ్) కొడుకు వీర వెంకట రమణ అలియాస్ రమణ (మహేష్ బాబు) చిన్నప్పుడే తల్లిదండ్రులిద్దరూ విడిపోవడంతో అతడు గుంటూరులో తన మేనత్త బుజ్జి (ఈశ్వరరావు) దగ్గర పెరుగుతాడు. వసుంధర మరో పెళ్లి చేసుకుని తెలంగాణ రాష్ట్రానికి న్యాయ శాఖ మంత్రి అవుతుంది. ఆమె తండ్రి వైరా వెంకటస్వామి (ప్రకాశ్ రాజ్) అన్నీ తానై రాజకీయ చక్రం తిప్పుతుంటాడు. వసుంధర రాజకీయ జీవితానికి ఆమె మొదటి పెళ్లి, మొదటి కొడుకు అడ్డంకిగా మారకూడదని భావించిన వెంకటస్వామి... రమణతో అగ్రిమెంట్ పై సంతకం పెట్టించుకోవాలని ప్రయత్నాలు మొదలు పెడతాడు. వసుంధరకి పుట్టిన రెండో కొడుకుని ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంటాడు. తల్లిని ఎంతో ప్రేమించే రమణ... ఆ అగ్రిమెంట్ పై సంతకం పెట్టాడా? ఇంతకి అందులో ఏముంది? తన తల్లిదండ్రులు ఎందుకు విడిపోయారు? కన్న కొడుకుని వసుంధర ఎందుకు వదిలిపెట్టింది? అన్నది చిత్ర కథ.

గుంటూరు కారం ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Post a Comment

Comments