ఎందుకు? ఏమిటి? ఎలా?🤔

✍️ ప్రశ్న: శ్రీకృష్ణదేవరాయల కొలువులో మహాకవులు ఎవరు?


జవాబు: శ్రీ కృష్ణదేవరాయల కొలువులోని మహాకవులను అష్టదిగ్గజాలని అంటారు . అష్ట = 8. 


1. అల్లసాని పెద్దన : మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు . ఇతనికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు ఉంది .


2. నంది తిమ్మన : ఈయనను ముక్కుతిమ్మన అని కూడా అంటారు . పారిజాతాపహరణం అనే గ్రంధాన్ని రచించాడు .


3. పింగళి సూరన : ఇతడు రాఘవ పాండవీయము అను ద్వర్ధి(శ్లేష)కావ్యమును , కళాపూర్ణోదయము , ప్రభావతీ ప్రద్యుమ్నము అనే గ్రంధాలు రచించాడు .


4. మాదయగారి మల్లన : ఇతడు రజశేఖర చరిత్ర అనే గ్రంధాని రచించాడు .


5. ధూర్జటి : శ్రీకాళహస్తి మహాత్యము , శ్రీకాళహస్తీశ్వర శతకము లను రచించాడు .


6. అయ్యలరాజ రామభద్రుడు : ఇతడు ' రామాభ్యుదయాన్ని రచించాడు ,


7. తెనాలి రామకృష్ణుడు : వికట కవి . పాండు రంగ మహత్యం కావ్యాన్ని రచించాడు .


8. రామరాజ భూషణుడు : భట్టుమూర్తి ఇతని నామాంతరము . వసువరిత్ర అనే శ్లేష కావ్యమును , హరిశ్చంద్రోపాఖ్యానము అనే ద్వర్ధి కావ్యము రచించాడు . 

    

Post a Comment

Comments