1 స్వయం తృప్తి { హస్త ప్రయోగం } అంటే తెలుసా ?
2 ఎన్ని రోజులకొకసారి చేస్తారు ?
3 . హస్త ప్రయోగం చేసేవారు - చేయని వారు - మీది ఏ కేటగిరీ ?
4 . నోటి ద్వారా సెక్స్ { ఓరల్ సెక్స్ } , మల ద్వారం సెక్స్ { అనల్ సెక్స్ } అంటే ఏంటో తెలుసా ?
ఏంటీ చెత్త మాటలు అనుకుంటున్నారా ?
ఆవేశ పడకండి .
చదవండి ....
ఇవీ ఇంగ్లాండ్ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల్లోని పాఠాలు.
టీచర్లు బడిలో పిల్లలకు చెబుతున్న పాఠాలు ....
ఇదేదో ఆషామాషీ వార్త కాదు .
ఇంగ్లాండ్ కు చెందిన 50 మంది ఎంపీ లు ఆ దేశ ప్రధానికి రాసిన లేఖలోని అంశాలు .
పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతొ, ఇంగ్లాండ్ పాఠశాలల్లో జరుగుతున్న ఘోరాన్ని, మిరియం గేట్స్ నాయకత్వం లో యాభై మంది ఎంపీ లు ప్రశ్నించారు .
తల్లితండ్రులకు తెలియకుండా వారి అనుమతి లేకుండా ఇది జరిగి పోతోంది అని వారు చెప్పారు .
ప్రైవేట్ పబ్లిషర్ ల కు పుస్తకాలు ప్రచురించే అవకాశం ఇచ్చారు . వారు ఇలాంటి చెత్త ను ముద్రించి పాఠశాలకు సరఫరా చేస్తున్నారు .
ప్రాధమిక పాఠశాలలో ఆరేళ్ళ పిలల్లకు హస్త ప్రయోగం గురించి పాఠాలు చెబుతున్నారని అంతే కాకుండా 13 ఏళ్ళ పిల్లలకు నీకు పురుషాంగం ఉంటే అబ్బాయిని , యోని ఉంటే అమ్మాయి అని అనుకోకూడదు ; మనసులో ఉన్న కోరికల బట్టే అమ్మాయా? అబ్బాయా అని డిసైడ్ చెయ్యాలి అని చెబుతున్నారు
" నిజానికి అమ్మాయి అబ్బాయి అనే రెండు కేటగిరీ లు మాత్రమే వుంటారనుకోవడం తప్పు . మొత్తం వంద కేటగిరీ లు వుంటారు { అబ్బాయి గా ఉండి మరో అబ్బాయి తో సెక్స్ కు ఇష్టపడేవారు , అమ్మాయి గా ఉండి అబ్బాయి తో అమ్మాయి తో ఒకే కాలం లో సెక్స్ కు ఇష్టపడేవారు ఇలా పలురకాలు }" .... ఇదీ పాఠ్య పుస్తకాల్లో ఉన్న చెత్త . ఇంగ్లాండ్ పాఠశాలల్లో టీచర్లు పసి మనసుల్లోకి ఎక్కిస్తున్న విషం
ఇది చదువుతుంటే కలియుగాంతం వచ్చి ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అనిపిస్తోంది కదా ?
పోర్న్ ఇండస్ట్రీ సంవత్సరానికి వంద బిలియన్ డాలర్స్ ఆదాయాన్ని పోగుచేస్తుంది . గేమింగ్ ఇండస్ట్రీ ఆదాయం 365 బిలియన్ డాలర్ లు . వీరు ప్రపంచాన్ని శాసిస్తున్నారు ..
వారు తమ లాభాలను పెంచుకోవడానికి తమ మార్కెట్ ను విస్తృత పరుచుకోవడానికి పాఠశాలల్లోకి చొరపడుతున్నారు . .కొంతమంది రాడికల్స్ అనే పేరుతొ దీన్ని ఆమోదిస్తున్నారు . పిల్లలు ఎలాగు స్మార్ట్ ఫోన్ పై సెక్స్ చూస్తున్నారు . వారికీ సెక్స్ పై సరైన అవగాహన పాటశాలల్లో కల్పించాల్సిన అవసరం ఉంది అని వీరి వాదన .
మానవ జాతి చరిత్రలో కనీవినీ ఎరుగని ఘోరం .. విషాదం .
{ పిల్లల్లో పోర్న్ అడిక్షన్ పై మరో పోస్ట్ చదవండి }
1 . 80 % పిల్లలు 13 ఏళ్లకే స్మార్ట్ ఫోన్ ల ద్వారా పోర్న్ చూడడానికి అలవాటుపడుతున్నారు .
2 . 18 ఏళ్ళు వచ్చేనాటికి హింసతో కూడుకొన్న సెక్స్ వీడియో లకు { అంటే రేప్ మదలైనవి } అలవాటుపడుతున్నారు .
3 . వెనుకటి రోజుల్లో నగ్న చిత్రాలు ప్రచురించే మ్యాగజైన్లు ఉండేవి . కాలం మారింది. ఇప్పుడు ఇవి ఇలా పోర్న్ రూపం లో వస్తున్నాయి అనుకోవడానికి వీలు లేదు . ఇప్పుడు నెట్ ద్వారా వస్తున్న పోర్న్ మహిళల పై హింసను ప్రేరేపిస్తున్నాయి . పిల్లలని కూడా సెక్స్ వస్తువులుగా చూడడాన్ని ప్రోత్సహిస్తున్నాయి . చైల్డ్ పోర్న్ విచ్చలవిడిగా లభిస్తోంది .
4 . చిల్డ్ ట్రాఫికింగ్ { అంటే పిల్లలని కొనడం , రవాణా చేసి సెక్స్ కోసం వాడుకోవడం } రేప్ , రివెంజ్ పోర్న్ ఇలాంటి ఇప్పుడు మెయిన్ పోర్న్ సైట్స్ లో విరివిగా లభ్యమవుతోంది .
5 . టీన్ సెక్స్ , ఇన్సెస్ట్ { అంటే వావి వరుసలు మరచి సంభోగించడం అంటే అన్న- చెల్లి , తండ్రి - కూతురు ఇలా } ఎక్కువ సెర్చ్ అవుతోన్న పదాలు ఇవి . అంటే ఎక్కువమంది ఇలాంటి సెక్స్ వీడియో ల కోసం వెదుకుతున్నారు . చూస్తున్నారు .
6 . హింసతో కూడిన సెక్స్ వీడియో లు చూసి యువత దానికి అలవాటు పడిపోతోంది . యాభై శాతం మంది టీన్ ఏజ్ అమ్మాయిలు తమకు ఫీజికల్ అగ్రేషన్ తో కూడిన సెక్స్ అంటేనే ఇష్టం అని చెప్పారు { అంటే సెక్స్ చేసేటప్పుడు కొరకడం , కొట్టడం ఇంకా పలురకాలు }. సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు ఊపిరి ఆడక గుండెపోటు వచ్చి చనిపోవడం అనేది ఇటీవల టీన్ ఏజ్ అమ్మాయిల్లో బాగా పెరుగుతోంది .
7 . చిన్న పిల్లల పై సెక్స్ అఘాయిత్యాలు ఇటీవల పెరిగి పోతున్నాయి . ఇలా పిల్లల పై అఘాయిత్యాలు చేసేవారిలో మూడో వంతు తోటి పిల్లలే . దీనికి కారణం స్మార్ట్ ఫోన్ లో దొరుకుతున్న చైల్డ్ పోర్న్ వీడియోలే .
8 . పండెమిక్ కాలం లో పిల్లలు పోర్న్ చూడడం 374 % పెరిగింది .
9 . పిల్లలకు జరుగుతున్న నష్టం అపారం . ఈ పరిణామాలు వారిని ని కోలుకోలేని విధంగా కుంగ తీస్తాయి . వారి మానసిక శారీరిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి . భవిష్యతును నాశనం చేస్తాయి .
..... ఇవీ ఇంగ్లాండ్ కు చెందిన ఎంపీ లు వారి ప్రభుత్వానికి రాసిన అధికారిక లేఖ సారాంశం . చిల్డ్రన్స్ కమీషనర్ ఈ వారం ప్రచురించిన అధికారిక పరిశోధక రిపోర్ట్ ఆధారంగా వారు ఈ లేఖ రాసారు .
దీన్ని చదివి చాలా మంది ఇదేదో ఇంగ్లాండ్ లో జరుగుతోన్న వ్యవహారం అనుకొంటారు .
ఇలాంటివి .. ఇంకా ఘోరాలు... ఇంతకు పది రెట్లు ఇండియా లో .. ప్రతి ఇంట్లో జరుగుతున్నాయి .
పదమూడు దాటక ముందే పిల్లలు సెక్స్ , రేప్ , హింసతో కూడిన సెక్స్ , గ్రూప్ సెక్స్ లాంటి వీడియో లకు అలవాటు పడిపోతున్నారు .
తల్లితండ్రులు" మన పిల్లలు మహా అమాయకులు" అనుకొంటూ నిద్దరోతున్నారు .
భారత రాజకీయ నాయకులకు డబ్బు- ఓట్లు -కబ్జాలు తప్పించి ఇంకేమీ పట్టవు . ఏదైనా ఇష్యూ ను టేక్ అప్ చెయ్యాలంటే "నాకేంటి లాభం ? ఏదైనా డబ్బొస్తుందా ? ఎవరి నైనా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించవచ్చా?' అని ఆలోచిస్తాడు హౌస్ అఫ్ కామన్స్ ఎంపీ ల లాగా ఇలాంటి వాటిని ఎత్తి చూపే ఒక్కడంటే ఒక్క రాజకీయ నాయకుడు లేడు.
గంజాయి నేడు ఇక్కడ కుటీర పరిశ్రమగా మారింది . ఇంటింటా పోర్న్ ఫెస్టివల్ నడుస్తోంది . పాటశాలల్లో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయి
పార్టీ పేరుతొ పిలిచి చంపి శరీరాన్ని ముక్క ముక్కలుగా నరికి ఫోటో లు తీసి వాట్సాప్ లో పంపించే హరిహర కృష్ణ లు , ఇలాంటి ఫోటో లు చూసి ప్రియుడ్ని మెచ్చుకొనే నిహారిక లు ఇంటిటా తయారవుతున్నారు .
మీ ఇంటి క్రైమ కథ మీడియా కు రెండు రోజులు వ్యూస్ ని పెంచే మసాలా సరుకుగా మారకముందే మేలుకోండి .
పోర్న్ , సెక్స్ , మహిళల పై హింస , గంజాయి , మద్యం లాంటి వాటిని ఎలెక్షన్ ఎజెండా గా మార్చి వివిధ రాజకీయ పార్టీ ల పై ఒత్తిడి తీసుకొని రండి .
ధన్యవాదములు 🙏
Comments