Tanuku: చెత్త కుప్పలో సీల్ చేసి ఉన్న డబ్బా.. తీసి చూస్తే మెడికల్ లో జరిగే మోసం



నేడు మనిషి మత్తుకి బానిసగా మారాడు. ఈ బలహీనతని  అలుసుగా భావించి కొంతమంది మత్తుకోసం వినియోగించే ఆల్ఫ్రాజోలం, సెక్స్‌ సమార్థ్యాన్ని పెంచే వయాగ్రా, గర్భవిచ్ఛిత్తి కోసం వాడే అబార్షన్‌ కిట్ల అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తూ ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటోంది మెడికల్‌ మాఫియా. 

పశ్చిమ గోదావరి జిల్లాలో మెడికల్ మాఫియా విచ్చలవిడిగా రెచ్చిపోతోంది. గత కొద్దిరోజులుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా సాగుతోన్న మందుల వ్యాపారం జనాన్ని భయ భ్రాంతులకు గురి చేస్తుంది. డాక్టర్‌ ప్రిస్కప్షన్‌తో పనిలేదు. అసలు డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరమే లేకుండా. కాసులు రాలిస్తే చాలు బ్యాన్డ్‌ (నిలిపివేసిన ) మెడిసిన్స్‌ ఏవైనా సరే మీముందొచ్చిపడతాయి. మెడికల్‌ మాఫియా అక్రమ దందా జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మరోవైపు తణుకు మండలంలో తేతలిలో పంటపొలాల్లో తేలిన అబార్షన్‌ కిట్లు జనాన్ని మరింత భయపడేలా చేశాయి. పశ్చిమగోదావరి జిల్లాకి తణుకు వైద్యకేంద్రంగా ఉంది. ఇక్కడ మందుల దుకాణం ముసుగులో జరుగుతోన్న అక్రమాల దందాకి అడ్డు ఆపు లేకుండా పోయింది. మత్తుకోసం వినియోగించే ఆల్ఫ్రాజోలం, సెక్స్‌ సమార్థ్యాన్ని పెంచే వయాగ్రా, గర్భవిచ్ఛిత్తి కోసం వాడే అబార్షన్‌ కిట్ల అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తూ ప్రజల బలహీనతలను సొమ్ముచేసుకుంటోంది మెడికల్‌ మాఫియా.

కొద్దిరోజుల క్రితం తణుకు మండలం తేతలిలో తాజాగా బయటపడ్డ వందలాది అబార్షన్‌ కిట్లు జిల్లాలో యథేచ్ఛగా సాగుతోన్న దొంగ మందుల వ్యాపారం గుట్టురట్టు చేసింది. రహదారి పక్కగా  ఉన్న పొలంలో ఒకటో రెండో కాదు…ఏకంగా 850 అబార్షన్‌ కిట్లు బయటపడటం కలకలం రేపుతోంది. వీటి విలువ అక్షరాలా 4 లక్షలు ఉంటుంది. ఇదే ఇప్పుడు స్థానికంగా ఒక పెద్ద హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే ఇక్కడ తేతిలిలో తీగలాగితే అక్కడ కర్నాటకలో డొంక అంతా  కదిలింది. ఇన్నాళ్ళూ ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థంగాక తికమకపడుతు తలలు పట్టుకున్న అధికారులకు నిషేధిత మందుల సప్లైవాళ్ళు  కర్నాటకలో ఉన్నట్టు రూఢీ అయ్యింది. దీంతో తణుకు భీమవరం మండలాల్లో ఐదు షాపులు గొడౌన్లు పై దాడులు చేసి 21 లక్షలు విలువ చేసే నిషేధిత మందులు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ వ్యాపారం దందాలో అసలు కీలక సూత్రధారి కె.శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు.

మొన్నటికి మొన్న తాజాగా ఐదు మెడికల్‌ షాపులపై దాడులు చేశారు అధికారులు…16 లక్షల విలువచేసే అక్రమ మందులు మొత్తం సీజ్‌…ఏడాది కాలంలో 9 మెడికల్‌ అక్రమ దందా కేసులు. పాతిక లక్షల విలువైన మందులు సీజ్‌…ఇదొక్కటి చాలు పూర్తిగా పశ్చిమగోదావరి జిల్లాలో సాగుతోన్న మెడికల్‌ మాఫియా దందా అర్థం చేసుకోవడానికి. ఈ అక్రమ మందుల దందాలో ఆర్‌ఎంపీలూ, పీఎంపీల పాత్ర కీలకమని తేలింది. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొస్తోన్న మందులు, అబార్షన్‌ కిట్లపై బ్యాచ్‌ నెంబర్లు, ఎంఆర్‌పీ ధరలను శానిటైజర్‌తో తుడిచేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

తణుకులోని వెంకటసాయి మెడికల్‌ స్టోర్‌లో నిషేధిత మందుల విక్రయం చాలా జోరుగా సాగుతోంది. అయితే ఒక్క మెడికల్‌ షాపులు మాత్రమే  కాదు…కొన్ని కొన్ని కిరాణా షాపుల్లో సైతం అక్రమ మందుల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, బెంగుళూరు ప్రాంతాల్లోని మెడికల్‌ రిప్రజెంటేటివ్స్‌ ద్వారా మందులు దిగుమతి చేసుకొని, అక్రమంగా నిలవచేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. గత నెలలో సైతం పాలకొల్లులో అక్రమ మందుల దందా నిర్వహిస్తోన్న ఆర్‌ఎంపీ పై దాడిచేసిన పోలీసులు చాలా పెద్దమొత్తంలో అక్రమ మందులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇప్పుడు కర్నాటక మూలాలు మొత్తం వెలికితీసేందుకు జిల్లా డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సంసిద్ధమౌతున్నారు. 

Post a Comment

Comments