Telugu Language: తెలుగు భాష లోని ప్రత్యేకత అదే మరి!

*అదే మరి మన భాష ప్రత్యేకత!*

నెలవంక ఉంటుంది గానీ…

వారంవంక ఉండదు.

పాలపుంత ఉంటుంది గానీ…

పెరుగుపుంత ఉండదు.

ప్రామిస్ ఉంటుంది గానీ…

ప్రామిష్టర్ ఉండడు.

పలకరింపు ఉంటుంది గానీ…

పుస్తకంరింపు ఉండదెందుకు?

పిల్లకాలవ ఉంటుంది గానీ…

పిల్లోడి కాలవ ఉండదు!

పామాయిల్ ఉంటాది గానీ…

తేలు ఆయిలు ఉండదండి.

కారు మబ్బులు ఉంటాయి గానీ…

బస్సు మబ్బులు ఉండవేమిటో!

ట్యూబ్ లైటు ఉంది గానీ…

టైర్ లైటు ఉండదు.

ట్రాఫిక్ జామ్ ఉంటాది గానీ…

ట్రాఫిక్ బ్రెడ్ ఉండదు.

వడదెబ్బ ఉంటాది గానీ…

ఇడ్లీ దెబ్బ ఉండదండి.

నిద్రగన్నేరు చెట్టు ఉంటాది గానీ….

మెలకువ గన్నేరు చెట్టు ఉండదండి.

ఆకురాయి ఉంటాది గానీ…

కొమ్మరాయి ఉండదండి.

పాలపిట్ట ఉన్నది గానీ…

పెరుగు పిట్ట, మజ్జిగ పిట్ట ఉండవు.

వడ్రంగి పిట్ట ఉంటాది గానీ…

కంసాలి పిట్ట ఉండదండి.

చుట్టరికాలు ఉంటాయి గానీ…

సిగరెట్టరికాలు ఉండవేమిటో.

రంగులరాట్నం ఉంటది గానీ…

బ్లాక్ అండ్ వైట్ రాట్నం ఉండదండి.

ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఉండదండి.

పులిహారలో పులి ఉండదండి.

నేతి బీరకాయలో నెయ్యి ఉండదు.

మైసూర్ పాక్ లో మైసూర్ ఉండనే ఉండదు.

గాలిపటంలో గాలి ఉండదండి.

గల్లాపెట్టిలో గల్లా ఉండదండి.

చివరాఖరుగా…

ఫేసు బుక్కులో పుస్తకం, యూ ట్యూబులో గొట్టం ఉండవు!

Leave a Comment