Hospital marriage: పెండ్లి పీఠలపై జరుగవలసిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది

 

*హాస్పిటల్ లో పెండ్లి* చేశారు 

మంచిర్యాలలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. 

ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడ జరగని సంఘటన మంచిర్యాల లో జరిగింది.

*పెండ్లి పీఠలపై జరుగవలసిన పెండ్లి ఆసుపత్రిలో జరిగింది*.

శస్త్ర చికిత్స జరిగి ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న వధువుకు వరుడు తాళికట్టాడు.  పెండ్లి మండపం లేదు… భజభజంత్రీలు లేవు.కుటుంబ సభ్యులు, బంధు, మిత్రుల సందడి లేదు… నిరాడంబరంగా ఆసుపత్రిలో జరిగింది.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కు చెందిన బానోథ్ శైలజ కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బస్వరాజు పల్లె గ్రామానికి చెందిన హట్కార్ . గురువారం లంబాడిపల్లిలో పెండ్లి జరగవలసి ఉండగా వధువు శైలజ బుధవారం అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు ఆమెకు శాస్త్ర చికిత్స నిర్వహించారు. బెడ్ రెస్ట్ అవసరమని శైలజ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి వైద్యుల కు విషయము చెప్పారు. వరుడు మంచి మనసును అర్థం చేసుకున్న వైద్యులు పెండ్లికి ఒప్పుకున్నారు. వైద్యులే పెండ్లి పెద్దలుగా మారారు.  బెడ్ పై ఉన్న శైలజకు తిరుపతి మాంగళ్యధారన చేసాడు.  శైలజ కు బుధవారం ఆపరేషన్ చేశామని ఆయన చెప్పారు…

Leave a Comment