టీడీపీలోకి నాదెండ్ల మనోహర్ వెళ్ళిపోతారా.?*రాయపాటి నీ రంగం లోకి దింపరా???*


టీడీపీలోకి నాదెండ్ల మనోహర్ వెళ్ళిపోతారా.? 


లేదంటే జనసేనలో వుంటూనే నాదెండ్ల మనోహర్,తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తారా.? 


కొత్త చర్చ షురూ అయ్యింది ఈవిషయమై.


టీడీపీ – జనసేన పొత్తు పంచాయితీ ఎటూ తేలడంలేదు.'ప్యాకేజీ' విమర్శలు తప్పించు కోవాలంటే,సోలో ఫైట్ తప్పదని జనసేన అధినేత భావిస్తున్నారు.                  


కానీ,పరిస్థితులు అందుకు అను కూలించడంలేదు.


ఇదిలా వుంటే,నాదెండ్ల మనోహర్‌ని టీడీపీలోకి లాగెయ్యడానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.                            


తాజాగా మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రంగంలోకి దిగారట. 

ఆయన ద్వారా 'పని' తేలిగ్గా చేయించేసు కోవచ్చని చంద్రబాబు భావిస్తున్నారట.


రాయపాటి సాంబశివరావు సీనియర్ పొలిటీషియన్ మాత్రమే కాదు, పారిశ్రామికవేత్త కూడా. 

పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు గతంలో రాయపాటి చేతుల్లోనే వుండేది.వైఎస్ హయాంలోనూ,చంద్రబాబు హయాంలోనూ రాయపాటి బాగా దండుకున్నారన్న ఆరోపణల సంగతి సరే సరి. ఇక,రాయపాటి.. నాదెండ్ల మనోహర్‌ని ఉద్దేశించి 'మావాడే.. మేం ఎలా చెబితే అలా వింటాడు..'అని సన్నిహితుల వద్ద చెబుతున్నారట.          


అంతే కాదు,'అంతా మాట్లాడేశాం..మేమెలా చెబితే జనసేన అలా నడుచుకుంటుంది' అంటూ రాయపాటి చెబుతున్నారట..                        


ఈ విషయం మీడియాకి ఎలా లీక్ అయ్యిందో గానీ, ఈ ప్రచారంపై జనసేన అప్రమత్తమయ్యింది.


నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్‌రావుపై 'వెన్నుపోటు' ఆరోపణలున్నాయి. 


స్వర్గీయ ఎన్టీయార్‌కి తొలి వెన్నుపోటు నాదెండ్ల భాస్కర్‌రావుదే.     


ఇప్పుడు ఆ భాస్కర్ రావు తనయుడు మనోహర్, పవన్ కళ్యాణ్‌కి రాజకీయంగా వెన్నుపోటు పొడుస్తారా.?                 


ఇంతకీ,నాదెండ్ల మనోహర్‌కి రాయపాటి ఎర చూపిన ఆఫర్ ఏంటి.?

Post a Comment

Comments