జీతాలు, బకాయిలకు నిధులు కేటాయించాలి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు డిమాండ్

 ఉద్యమానికి మద్దతివ్వాలని ఉద్యోగులకు పిలుపు


అమరావతి, మార్చి 18: ఉద్యోగుల జీతాలు, బకాయిలు చెల్లింపు నకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్ప రాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురు వారం విజయవాడలోని పశుసంవర్ధకశాఖ రాష్ట్ర ప్రధానకార్యాలయం, ఆర్ అండ్ బీ కార్యాలయం, ఏపీపీఎస్సీ కార్యాలయాల్లో ఆయన పర్యటించారు. ఉద్యోగుల సమ స్యల పరిష్కారం కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉద్యోగు లను కోరారు. 

ఈ నెల 21 నుంచి తాము చేపట్టనున్న వర్క్ టు రూల్లో ఉద్యోగు అందరూ విధిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించ కుంటే ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి మలిదశ(భవిష్యత్) కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చెందుతున్న అవేదనే ఈ ఉద్యమానికి కారణమన్నారు. తమవి గొంతెమ్మ కోర్కెలు కాదని, తమకు రావా ల్సిన డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. "మా బకా యిలు చెల్లించాలని, 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని అడుగుతున్నాం. ఇది తప్పా! మా డిమాండ్లు న్యాయం కాదా?" అని ప్రశ్నించారు. ఉద్యోగుల జీతభ త్యాల కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు ఏమవుతున్నాయని ప్రశ్నించారు. 

ఈ ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వమే చెప్పాలన్నారు. న్యాయమైన డిమాండ్ల పరి ష్కారం కోసం చేస్తున్న ఉద్యమానికి అందరూ మద్దతివ్వాలని కోరారు.


Post a Comment

Comments