అదృశ్యమైన ప్రేమ జంట మెదక్‌ చెరువులో శవమై తేలారు

 

నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మతాల బేధాల కారణంగా పెద్దలు వీరి పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కల్పనకు మరో వ్యక్తితో వివాహమైంది. తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన కల్పన నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజున తమ కూతురు కనిపించడం లేదంటూ కల్పన తల్లిదండ్రులు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్ ప్రేమ విషాదంగా ముగిసింది 

మెదక్‌ జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది...


ఫిబ్రవరి 14న కనిపించకుండా పోయిన ప్రేమ జంట అదృశ్యం విషాదాంతంగా ముగిసింది...


తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు...


గురువారం ఉదయం నార్సింగి చెరువులో నుంచి వాళ్ల మృతదేహాలను వెలికితీశారు...


నార్సింగికి చెందిన కల్పన, ఖలీల్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు...


మతాలు వేరుకావడంతో వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించారు...


ఈ క్రమంలో కల్పనకు వేరే వ్యక్తితో రెండు నెలల క్రితం పెళ్లి చేశారు...


ఇటీవల పుట్టింటికి వచ్చిన కల్పన.. నాలుగు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది...


విచారణలో నార్సింగి శివారులోని చెరువు వద్ద కల్పన, ఖలీల్ చెప్పులు, బైక్‌లను పోలీసులు గుర్తించారు. వారిద్దరూ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావించారు. రెండు రోజులుగా చెరువులో వెతికినా గురువారం ఉదయం ప్రేమికుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Post a Comment

Comments