చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి – 19} ప్రాముఖ్యత

 

🌎చరిత్రలో ఈ రోజు {ఫిబ్రవరి – 19}🌎

🔎సంఘటనలు🔍

🌸1537: నెదర్లాండ్స్ లోని లీడెన్ లో చేనేత కార్మికులు సమ్మె చేసారు.

🌸1700: డెన్మార్క్ లో జూలియన్ కేలెండర్ ఆఖరి రోజు.

🌸1819: బ్రిటిష సాహసికుడు విలియం స్మిత్. ‘సౌత్ షెట్లాండ్ దీవులను’ కనుగొని, వాటికి హక్కుదారులుగా, ‘కింగ్ జార్జి ĪĪĪ’ పేరు పెట్టాడు.

🌸1831: అమెరికాలోని, పెన్సిల్వేనియాలో, మొదటిసారిగా బొగ్గుతో నడిచే యంత్రాన్ని ప్రయోగాత్మకంగా నడిపారు.

🌸‍1856: టిన్ టైప్ కెమెరాకి హామిల్టన్ స్మిత్ పేటెంట్ పొందాడు (గేంబియర్, ఓహియో).

🌸1861: రష్యన్ జార్ చక్రవర్తి అలెగ్జాండర్ -2 సెర్ఫ్ డం (రష్యాలోని బానిస రైతు విధానం – వెట్టి చాకిరితో సమానం) ని రద్దు చేసాడు.

🌸‍1881: అమెరికాలో మొదటిసారిగా మధ్యనిషేధాన్ని ప్రవేశపెట్టినది ‘కాన్సాస్’ రాష్ట్రం.

🌸1878: థామస్ ఎడిసన్ తన ఫోనోగ్రాఫ్ కి పేటెంట్ పొందాడు.

🌸1969: బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.

🌸1970: స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.

🌸1976: ఫ్రెంటె పోలిసారియో – డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ సహారాగా అవతరించింది.

🌸1977: షటిల్ ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ 747 జెట్ లైనర్ ని ఆకాశంలోకి ప్రయోగాత్మకంగా పరిశీలించింది.

🌸1982: బోయింగ్ 757 అనే విమానం మొట్టమొదటిసారిగా ఆకాశంలో ఎగిరింది.

🌸1984: 14వ వింటర్ ఒలింపిక్స్ యుగోస్లావియా లోని సరజెవో నగరంలో ముగిసాయి.

🌸1985: స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని ‘బిల్బావొ’ దగ్గర కూలి 150 మంది మరణించారు.

🌸1985: ఆమ్ స్టర్ డామ్ లోని ఏ.డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.

🌸1985: కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.

🌸1985: కోకా కోలా మొదటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.

🌸1985: లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.

🌸1985: ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.

🌸1986: సోవియట్ యూనియన్ (నేటి రష్యా) ‘మీర్’ అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.

🌸1999: నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు

🌸1990: సోయుజ్ టి.ఎమ్-9 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.

🌸1998: సోయుజ్ టి.ఎమ్-26 (రష్యన్ రోదసీ నౌక పేరు) భూమి మీద దిగింది.

🌸2002: నాసా కుజగ్రహానికి పంపిన ‘మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక’ “థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం”ని ఉపయోగించి కుజగ్రహం యొక్క భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.

🌸2008: 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.

🌼జననాలు🌼

💙1473: నికోలస్ కోపర్నికస్, సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త. (మ.1543)

💙1564: గెలీలియో గెలీలి, భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. (మ.1642)

💙1630: ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర

💙1899: బల్వంతరాయ్ మెహతా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.

💙1905: వెంపటి సదాశివబ్రహ్మం పేరుపొందిన చలనచిత్ర రచయిత.

💙1919: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006)

💙1952: ఆలపాటి లక్ష్మి, రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.

💐మరణాలు💐

🍁1915: గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866)

🍁1941: జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860)

🍁1997: డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.

🍁2009: నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి.

🍁2011: వనం ఝాన్సీ, భారతీయ జనతా పార్టీ నాయకురాలు.

🍁2015: రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965)

🍁2018: గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్యనటుడు. (జ.1956)

Leave a Comment